Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:14 AM

వైభవంగా జరిగిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ – గురుజువాడలో పండుగ వాతావరణం

01-03-2026 361 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పరిధిలోని గురుజువాడ గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. గురువారం నిర్వహించిన ఈ మహోత్సవం గ్రామ చరిత్రలో నిలిచిపోయేలా, కనులపండుగలా, కనివిని ఎరగని రీతిలో అత్యంత వైభవంగా జరిగింది. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయి, భక్తి, దేశభక్తి, సంస్కృతి సమ్మిళితంగా ఈ కార్యక్రమం అద్భుతంగా సాగింది.కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, ఆదిత్యపరాశ్రీ స్వామి జి ముఖ్య అతిథులుగా హాజరై ఆశీర్వచనాలు అందించారు.ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గొల్ల భాస్కర్, కోహిర్ మండల అధ్యక్షుడు వైద్యనాథ్, బూత్ అధ్యక్షులు జి. చంద్రశేఖర్, కె. జి. శివశంకర్, నాయకులు కిస్టన్న, మాజీ సొసైటీ చైర్మన్ శంకర్ రెడ్డి, నర్సింలు, నరేష్, జహీరాబాద్ టౌన్ అధ్యక్షులు పూల సంతోష్, కౌన్సిలర్లు అప్పం శ్రవణ్, బొగ్గుల సంతోష్, ప్రసాది మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.అలాగే గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణతో గ్రామంలో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. ఆయన వీరత్వం, పరాక్రమం, దేశభక్తి స్ఫూర్తిని నేటి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.గురుజువాడ గ్రామ ప్రజల ఐక్యతకు, సంఘీభావానికి ఈ మహోత్సవం నిదర్శనంగా నిలిచింది. గ్రామ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే ఈ వేడుక అందరి హృదయాలను హత్తుకుంది.

Sthanikam

వైభవంగా జరిగిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ – గురుజువాడలో పండుగ వాతావరణం

Article Image

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News