Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:18 AM

వై. పండరి ఆధ్వర్యంలో అవదత్ పూర్‌లో మహిళలకై ప్రత్యేకంగా ఏర్పాటైన వేడుక

08-03-2026 376 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నాగల్గిద్ది మండలం అవదత్ పూర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ మరియు సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామంలోని మహిళల సాధికారత, వారి సేవలను గౌరవించడం మరియు సమాజంలో మహిళల పాత్రను గుర్తు చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామ మహిళా సమాఖ్య కార్యదర్శి వై. విమల, 10వ వార్డు సభ్యురాలు బి. అక్షిత, గ్రామ సీనియర్ మహిళలు నర్సమ్మ, ఈరమ్మ తదితర మహిళలను శాలువాలతో సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబం, సమాజం అభివృద్ధిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, మహిళల ప్రగతితోనే సమాజం ముందుకు సాగుతుందని వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యుస్సుబ్, రాజు స్వామి, సుందర్, గ్రామ మహిళా సమాఖ్య వీఓఏ జీతప్ప, గ్రామ పంచాయతీ కార్మికుడు గణపతి మరియు గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

వై. పండరి ఆధ్వర్యంలో అవదత్ పూర్‌లో మహిళలకై ప్రత్యేకంగా ఏర్పాటైన వేడుక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News