Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:15 AM

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ ఆదేశం

15-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో ఉపాధి హామీ పథకంకింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, డిఆర్డిఏ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న పాఠశాలల కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులను నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పనిని నాణ్యతతో చేపట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని, పనుల్లో ఎక్కడ ఆలస్యం జరుగుతుందో అక్కడ వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో కాంపౌండ్ వాల్‌లు, టాయిలెట్స్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు భద్రతా, పరిశుభ్ర వాతావరణం కల్పించాలని తెలిపారు. మహిళా సంఘ భవనాల నిర్మాణం ద్వారా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొంటూ, ఈ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ పెంచి పనుల నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, డిఆర్డిఏ మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను సమయానికి పూర్తి చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పీడీ జ్యోతి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ ఆదేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News