Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:21 AM

ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు

15-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట్ మండల పరిధిలో ప్రసిద్ధి చెందిన కొప్పోల్ ఉమ సంగమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ఆలయాన్ని సందర్శించి ఉమ సంగమేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

Sthanikam

ఉమ సంగమేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News