Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:08 AM

ఉగాది సందర్బంగా నల్లపోచమ్మ సన్నిధిలో షడ్రుచుల పచ్చడి పంపిణీ

19-03-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో, మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో పంచామృతాలు, గంగాజలంతో అభిషేకాలు నిర్వహించి, కుంకుమార్చన పూజలు చేశారు.అనంతరం అమ్మవారికి నుదుట పసుపు, కుంకుమ తిలకం దిద్ది, పట్టువస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు.తరువాత అమ్మవారికి హారతులు సమర్పించి, నైవేద్యం నివేదించారు.ఉగాది పండుగను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని,తమ కుటుంబాల శ్రేయస్సు,ఆరోగ్యం,ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు వివిధ గ్రామాల చెందిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉగాది సందర్బంగా నల్లపోచమ్మ సన్నిధిలో షడ్రుచుల పచ్చడి పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News