Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

01-03-2026 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమని రామన్నపేట మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ పేర్కొంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన ఉద్యమకారుల్లో నూతన ఆశలు నింపిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాలువాతో సత్కరించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఉద్యమకారులకు తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫోరం ప్రతినిధులు తెలిపారు. అమరుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు రెబ్బాసు రాములు, బొడ్డుపల్లి లింగన్న, డాక్టర్ నకిరేకంటి అశోక్ కుమార్, గడ్డం యాదగిరి, నక్క శంకరయ్య, మందడి రవీందర్ రెడ్డి, ఏలూరు రవి, హరికృష్ణ, బెడుదలింగం నరసింహ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల రామన్నపేటలో ఫోరం కమిటీ కృతజ్ఞతలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News