Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:09 AM

తూమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు

11-04-2026 284 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తూమ్నూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యా విస్తరణ, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషి అందరికీ ఆదర్శమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

Sthanikam

తూమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తూమ్నూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యా విస్తరణ, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషి అందరికీ ఆదర్శమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News