Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్

28-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల కేంద్రం, భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు తరగతి గదుల నుంచే వేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్ అన్నారు. మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్, గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారతీయ విజ్ఞాన సంపద గొప్పదనాన్ని గుర్తుచేశారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకుని సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రయోగాత్మక అధ్యయనం ద్వారా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులు రూపొందించిన శాస్త్ర నమూనాలు, ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోట్ రమేష్, పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణి, డైరెక్టర్ జెల్ల వెంకటేష్, సైన్స్ ఉపాధ్యాయులు మురళి, మల్లేష్, శ్రావణి, ఎస్.ఉమారాణి, ఏ.మమత, శ్వేత, ఉపాధ్యాయులు రషీద్, ఆలీం, బి.ఉమారాణి, మహాలక్ష్మి, కె.లావణ్య, పునందాస్, కల్పన, వినోద, మాధవి, విజయలక్ష్మి, సంధ్య కరుణ, శైలజ, అనూష, ఫరియా, టి.లావణ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తరగతి గదిలోనే భావి భారత శాస్త్రవేత్తలకు పునాదులు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News