Sthanikam - Truth Matters
Logo

తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత

Updated : 05 Feb 2026 01:03 IST
As Preferred Source 1 min read
తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా  తల్లిదండ్రులకు అప్పగింత

నార్కట్‌పల్లి బీసీ హాస్టల్ నుంచి తప్పిపోయిన 10వ తరగతి విద్యార్థి నూకల శశాంక్ (15), అన్నెపర్తి గ్రామం, నల్లగొండ జిల్లా వాసిని పోలీసులు 24 గంటల్లోనే భద్రంగా గుర్తించారు.

తేదీ 03.02.2026 ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను గాలింపు చర్యలకు నియమించారు.

తేదీ 04.02.2026 ఉదయం భువనగిరి బస్టాండ్ వద్ద బాలుని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుని ఆచూకీ గుర్తించిన కానిస్టేబుళ్లను ఎస్సై అభినందించారు.

Sthanikam

తప్పిపోయిన బాలుని 24 గంటల్లో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత

Article Image

నార్కట్‌పల్లి బీసీ హాస్టల్ నుంచి తప్పిపోయిన 10వ తరగతి విద్యార్థి నూకల శశాంక్ (15), అన్నెపర్తి గ్రామం, నల్లగొండ జిల్లా వాసిని పోలీసులు 24 గంటల్లోనే భద్రంగా గుర్తించారు.

తేదీ 03.02.2026 ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను గాలింపు చర్యలకు నియమించారు.

తేదీ 04.02.2026 ఉదయం భువనగిరి బస్టాండ్ వద్ద బాలుని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుని ఆచూకీ గుర్తించిన కానిస్టేబుళ్లను ఎస్సై అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news