Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి

02-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం హృదయాన్ని కదిలించే ఘటనకు వేదికైంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి ఓ వృద్ధ దంపతుల జీవితంలో ఆశాకిరణంగా నిలిచారు.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మ సోమిరెడ్డి–రమణమ్మ దంపతులు తమ ఇద్దరు కుమారులు ఆస్తి పంచుకుని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి, కుమారులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ సిటిజన్ చట్టం–2007 ప్రకారం సబ్‌డివిజన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వారి వైఖరిలో మార్పు రాలేదు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. “మాకు ఎవరూ లేరు… మాకు మీరే దిక్కు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేదనకు చలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించి ఆశ్రయం కల్పించారు.

వృద్ధుల సమస్యలను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి గట్టి హెచ్చరికగా మారింది.

Sthanikam

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు మానవతతో అండగా నిలిచిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News