Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....
02-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆదరించి ఆశ్రమంలో చేర్పించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి....

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కన్న కొడుకులు నిర్లక్ష్యంతో తల్లిదండ్రుల బాగోగులు పట్టించు కోకపోవడంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. మానవతా హృదయంతో చలించిపోయిన కలెక్టర్ ఆ వృద్ధ దంపతులను ఆదరించి, వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ధర్మ సోమిరెడ్డి రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచుకొని,వారిని నిర్లక్ష్యం చేయడంతో గత సంవత్సరం డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. మరుసటి రోజే భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి గ్రామానికి విచారణకు వెళ్ళి,పూర్తి వివరాలు సేకరించారు. వృద్ధ దంపతుల కుమారులైన ధర్మ వెంకట నరసింహ రెడ్డి,ధర్మ గోవర్దన్ రెడ్డి లను పలుమార్లు ఆర్డీఓ కార్యాలయం లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం భువనగిరి ఆర్డీవో,సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం సబ్ డివిజన్ ట్రిబ్యునల్, వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్,రాజస్వ మండలాధికారి భువనగిరి గారి ఉత్తర్వు 2647/2025,తేదీ 27-01-2026 నాడు జడ్జిమెంట్ ఆర్డర్ పంపించారు. అయినా ఆ కుమారులు మారలేదు, ఆర్డీఓ ఆర్డర్ ను బేఖాతరు చేసారు. దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు అప్పిలేట్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను సోమవారం ప్రజావాణిలో కలిసి మొరపెట్టుకున్నారు. మాకు ఎవరూ లేరు. మాకు మీరే దిక్కు, మమ్మల్ని అనాధాశ్రమంలో చేర్పించండి అంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆ వృద్ధ దంపతులకు అండగా నిలిచారు.చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు లోని వయోవృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా నిర్లక్ష్యం చేసే కొడుకులకు ఈ సంఘటన కనువిప్పు కలుగాలని ఆశిద్దాం.....

Sthanikam

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులు....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News