Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ

28-02-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో రైతుకు చెందిన ట్రాన్స్ఫార్మర్‌ను పగలగొట్టి రాగి వైర్లు అపహరించిన ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

బాధిత రైతు జగ్గవరపు పిచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ పరిధిలోని రేగులకుంట కట్టకింద ఉన్న తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి వైర్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనతో పంటలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, భారీ నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

గ్రామ పరిసరాల్లో ఇటీవల ఇటువంటి చోరీలు పెరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పహారా పెంచాలని వారు పోలీసులను కోరుతున్నారు.

Sthanikam

ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి వైర్ చోరీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News