Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

సోలార్ లైటింగ్ వ్యవస్థను పరిశీలించిన మంత్రి సవిత

03-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా లోని పెనుకొండ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ పరిశీలించారు.

పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో రాత్రివేళ వాకింగ్‌కు వచ్చే పాదచారులకు తగిన వెలుతురు సదుపాయం కల్పించాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి, మైదానం చుట్టూ సమగ్ర లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయించారు. అనంతరం అక్కడికి వెళ్లి లైటింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, వాకింగ్‌కు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

రాత్రి వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ లైటింగ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని పట్టణ వాసులు మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.

తదుపరి, పెనుకొండ పట్టణంలోని వై జంక్షన్ వరకు ఇటీవల ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా మంత్రి పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రహదారులపై సమగ్ర వెలుగుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

అనంతరం పట్టణంలోని ఎంఎజేపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించి, పాఠశాలలో ఉన్న సదుపాయాలు మరియు సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆమె ప్రోత్సహించారు.

పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి వేగంగా స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు

Sthanikam

సోలార్ లైటింగ్ వ్యవస్థను పరిశీలించిన మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News