Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:06 AM

సంగారెడ్డిలో శిశు గృహం, సఖి కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు

12-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలోని శిశు గృహం మరియు సఖి కేంద్రాల్లో అందుతున్న సేవలు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానిచంద్ర సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా శిశు గృహాన్ని సందర్శించిన ఆమె అక్కడి వసతి సదుపాయాలు, పిల్లలకు అందిస్తున్న ఆహారం, ఆరోగ్య పరిరక్షణ, విద్యా అవకాశాలు తదితర అంశాలను పరిశీలించారు. శిశు గృహంలో నివసిస్తున్న చిన్నారుల పట్ల అధికారులు మరియు సిబ్బంది మరింత శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.పిల్లల సంరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని,వారి ఆరోగ్యం,చదువు,వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.అదేవిధంగా పిల్లల్లో క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందేలా ఉపాధ్యాయులు మరియు సిబ్బంది మార్గనిర్దేశం చేయాలని సూచించారు. శిశు గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల అవసరాలను తెలుసుకుని వాటిని తక్షణమే తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.తరువాత సఖి కేంద్రాన్ని సందర్శించిన ఆమె అక్కడికి వచ్చే బాధిత మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. కుటుంబ సమస్యలు, హింస వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల పట్ల సిబ్బంది సానుభూతితో వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కార మార్గాలను చూపించాలని సూచించారు. బాధిత మహిళలకు అవసరమైన చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్ మరియు రక్షణ చర్యలు సమయానికి అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న పేదలు, మహిళలు, పిల్లలు మరియు అర్హులైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని తెలిపారు. న్యాయ సహాయం అవసరమైన వారు సంగారెడ్డిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, అక్కడి అధికారులు అవసరమైన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందిస్తారని తెలిపారు.

Sthanikam

సంగారెడ్డిలో శిశు గృహం, సఖి కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News