Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:09 AM

సంగారెడ్డిలో ప్రణాం డే కేర్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

07-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. వసంతరావు ప్రణాం డే కేర్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే వృద్ధులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఇంకా సేవలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన వైద్య పరీక్షలు, సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.ఈ సందర్భంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు శేషుకర్ మరియు సిబ్బంది వృద్ధులకు రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించారు. అలాగే సాధారణ ఆరోగ్య పరీక్షలు కూడా చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి ఆరోగ్య సూచనలు మరియు జాగ్రత్తలు తెలియజేశారు.వృద్ధుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలించేందుకు వారానికి ఒకసారి డే కేర్ కేంద్రాన్ని సందర్శించి వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు ఇవ్వాలని వైద్య అధికారికి సూచించారు.వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.ప్రణాం డే కేర్ కేంద్రం ద్వారా వృద్ధులకు మంచి సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది వృద్ధులు ఈ కేంద్రంలో సభ్యత్వం తీసుకుని అందుతున్న సేవలను వినియోగించుకోవాలని పత్రికాముఖంగా తెలియజేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సి. వనజ రెడ్డి, మహిళా అభివృద్ధి శాఖ అధికారి లలిత కుమారి మరియు సిబ్బంది అందరి సేవలను అభినందించారు.

Sthanikam

సంగారెడ్డిలో ప్రణాం డే కేర్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News