Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచనల మేరకు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. అనంతరం పట్టణ కార్యదర్శి నర్సింలు పార్టీ జెండాను ఎగురవేయగా, పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ చేసిన సేవలను నాయకులు గుర్తుచేశారు. కంది జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించగా, నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ – జై బీఆర్ఎస్ నినాదాలతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News