Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం

27-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాలు సోమవారం ప్రారంభమై మే 2 వరకు కొనసాగనున్నట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 08 చైల్డ్ కేర్ సంస్థలలో ఉన్న పిల్లలకు ధృవీకరణ పత్రాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారికి అవసరమైన ప్రభుత్వ పత్రాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, 16 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతకు డీఆర్‌డీఏ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం పిల్లల సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చైల్డ్ కేర్ సంస్థలలో ఉన్న పిల్లలకు ప్రభుత్వ పర్యవేక్షణలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తూ పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు దాటిన 10 మంది పిల్లలకు ఆఫ్టర్ కేర్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు, సీసీఐ ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డిలో బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News