Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

సంగారెడ్డి–అందోల్ సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

17-04-2026 398 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కలిసి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అందోల్ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చంటి క్రాంతి కిరణ్ వివరించారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి అసమాన పంపిణీ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా లెఫ్ట్ కాలువ ద్వారా అందోల్ ప్రాంతానికి నీరు అందడం లేదని, దీంతో పుల్కల్, అందోల్ మండలాల్లోని సాగుభూములు పాడుబడుతున్నాయని తెలిపారు. సింగూర్ డ్యామ్‌లో నీరు ఉన్నప్పటికీ “రిపేర్ పనులు” పేరుతో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. అలాగే ముందస్తు సమాచారం లేకుండా నీరు విడుదల చేయడంతో పోచారం, ముద్దాయిపేట్, పుల్కల్, మిమ్పూర్, ఈసాజీపేట్, గంగోజిపేట్ గ్రామాల్లో వరదలు వచ్చి వందల ఎకరాల పంటలు నష్టపోయాయని, బాధిత రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు క్రాప్ హాలిడే లేదా తగిన పరిహారం ఇవ్వడం, కాలువలు–డ్యామ్ మరమ్మతులు వేగవంతం చేయడం, వచ్చే సీజన్ నుంచి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం, నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.ఇక సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరగా, కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారు. అలాగే నియోజకవర్గంలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇద్దరు నేతలు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి–అందోల్ సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News