Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:09 AM

సంగారెడ్డి జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు చట్టం అమలు

28-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు చట్టం–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, అందుకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఈ కాలంలో జిల్లాలో ఎవరైనా వ్యక్తులు, ప్రజాప్రతినిధులు లేదా సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.

ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగా సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రజాధనానికి నష్టం కలిగించే కార్యకలాపాలు, చట్టవిరుద్ధంగా గుంపులుగా కూడడం వంటి వాటిపై కఠిన నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహాయపడాలని సూచించారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు చట్టం అమలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News