Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు

03-03-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ పెద్ద నందిపాటి రామలింగం మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి గ్రామ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తక్షణ సహాయం అందించారు.

గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి 50 కిలోల బియ్యం ఇచ్చారు. 2వ వార్డు సభ్యులు గాదే శంకరయ్య రూ.2 వేల రూపాయలు, ఎంపీటీసీ పున్న వెంకటేశం రూ. 1000 రూపాయలు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు కూనూరు ముత్తయ్య, అప్పం శ్రీరాములు, పోలెపాక కృష్ణ, గంజి శ్రీనివాస్, కూనూరు లింగస్వామి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. గ్రామస్థులు కూడా సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Sthanikam

సిరిపురంలో నిరుపేద కుటుంబానికి అండగా గ్రామ నేతలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News