Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 17, 2026 03:01 PM

సిరికొండలో డయేరియా కేసులు పూర్తిగా నివారించాలి : జిల్లా కలెక్టర్

సిరికొండలో డయేరియా కేసులు పూర్తిగా నివారించాలి : జిల్లా కలెక్టర్

సిరికొండలో డయేరియా కేసులు పూర్తిగా నివారించాలి : జిల్లా కలెక్టర్
January 27, 2026 05:17 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్ధానికం ప్రధాన ప్రతినిధి:

మోతే మండలం సిరికొండ గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా నియంత్రించే వరకు నిరంతర ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం జడ్పీ సీఈఓ శిరీష, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, తహసీల్దార్ వెంకన్న, ఎంపిడిఓ ఆంజనేయులు, మెడికల్ అధికారి భవాని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి తదితరులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్ ఆదేశాలు:

సిరికొండ గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా నివారించే వరకు ఆరోగ్య శిబిరాలు కొనసాగించాలి

పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేపట్టాలి

మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య, పారా మెడికల్ సిబ్బంది 24×7 విధుల్లో ఉండాలి

శుద్ధమైన త్రాగునీటి వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి

వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి

అధికారుల వివరణ:

గత గురువారం సిరికొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విరేచనాలతో బాధపడుతున్నట్లు ఆశా కార్యకర్త గుర్తించారు

మెరుగైన చికిత్స కోసం మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు

గత మూడు రోజులలో 50 మందికి వైద్య చికిత్స అందించారు

మిరప తోటలో పనులకు వెళ్లి కలుషిత నీటిని త్రాగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు

నీటి నమూనాలను పరీక్షల కోసం పంపించారు

అధికారులు, గ్రామస్తులు పరస్పర సమన్వయంతో పనిచేసి అస్వస్థతకు గురైన ప్రజలు త్వరగా కోలుకునేలా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News