Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:18 AM

శివనామ స్మరణల మధ్య మహా పడిపూజ – గుఱ్ఱపు మచ్చేందర్ సందేశం

15-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శివ స్వాముల మహా పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ పుణ్య కార్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొని శివ స్వాములను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించి గ్రామ ప్రజలకు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సత్సంకల్పాలను బలపరుస్తాయని పేర్కొన్నారు. యువత మంచి మార్గంలో నడవడానికి, సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొనడానికి ఇటువంటి పూజా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవ తన ప్రధాన లక్ష్యమని, గంగాపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో గంగాపూర్ సర్పంచ్ బొల్లెపల్లి లక్ష్మి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ సాగర్, ఉప సర్పంచ్ రుక్మిణి శంకర్, మాజీ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, అంబటి సంజీవరెడ్డి, కళ్యాణం ధర్మారెడ్డి స్వామి, మార్డి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కర్ణం రాజు, వడ్ల రాములు, నాయకులు శ్రీకాంత్, భూమన్న సాగర్, మధు, అంజన్న, అనిల్ సాగర్, నరేష్ సాగర్ తదితర గ్రామ పెద్దలు, హన్మండ్లు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.భక్తుల సమక్షంలో నిర్వహించిన ఈ మహా పడిపూజ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచి, సత్సంస్కారాల పరిరక్షణకు దోహదపడింది. గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషం.

Sthanikam

శివనామ స్మరణల మధ్య మహా పడిపూజ – గుఱ్ఱపు మచ్చేందర్ సందేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News