Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:18 AM

శిశు గృహం, ప్రణామ్ డే కేర్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ – సేవలను సమీక్షించారు

02-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, దత్తత ప్రక్రియ వేగవంతం, వయోవృద్ధుల సంక్షేమ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సోమవారం మహిళా ప్రాంగణంలోని శిశు గృహం మరియు ప్రణామ్ డే కేర్ సెంటర్ను సందర్శించారు.శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న ఏడుగురు చిన్నారుల ఆరోగ్యం, వారికి అందుతున్న పోషకాహారం, వైద్య సేవల వివరాలు కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు.దత్తత ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారులు వివరించారు.కలెక్టర్ చిన్నారుల ఆరోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన ఏవైనా సమస్యలు వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.తదుపరి, వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్ను సందర్శించి, వృద్ధులతో మాట్లాడి అందరికీ అందుతున్న సదుపాయాలు, రోజువారీ కార్యకలాపాలు, సౌకర్యాల పరిస్థితులను సమీక్షించారు. వృద్ధులు, క్యారం, చెస్, పత్రికలు, టీవీ వంటి సదుపాయాలతో సంతోషంగా సమయం గడుపుతున్నారని, భోజనం ఇంటికి పంపబడటంతో సౌకర్యంగా ఉందని తెలిపారు.కలెక్టర్, ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, వారికోసం సౌకర్యవంతమైన డే కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.వృద్ధులు ఈ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.డే కేర్ సెంటర్‌లో మెంబర్షిప్ రిజిస్టర్ మరియు విజిటర్స్ రిజిస్టర్లను పరిశీలించి, వయోవృద్ధులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపీ సామగ్రి అందుబాటులో ఉంచాలని, మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిసిపి రత్నం, మేనేజర్ మొగులయ్య, సఖి సీఏ కల్పన, డే కేర్ సిబ్బంది దీప, జయశ్రీ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శిశు గృహం, ప్రణామ్ డే కేర్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ – సేవలను సమీక్షించారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News