Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సైన్స్ ఫెయిర్

02-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతుందని లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ మల్ల శ్రీనివాస్ అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సోమవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

పాఠశాల విద్యార్థుల మేధోసంపత్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు తమ సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పాఠశాలకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మానవ సమాజం కాలానుగుణంగా వివిధ రంగాలలో సాధిస్తున్న పురోగతి, ఆధునిక జీవన విధానంలో టెక్నాలజీ ప్రాధాన్యత ఈ ప్రదర్శన ద్వారా స్పష్టమైందన్నారు. శాస్త్ర విజ్ఞానం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించి భవిష్యత్తుకు దారి చూపుతుందని పేర్కొన్నారు.

భారతదేశం శాస్త్ర, సాంకేతికత, రక్షణ రంగాలలో ప్రపంచస్థాయిలో తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని, విద్యార్థులు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

శాస్త్ర–సాంకేతిక రంగాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సీవీ రామన్ జయంతి సందర్భంగా లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సైన్స్ ఫెయిర్

Article Image

బీబీనగర్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతుందని లిటిల్ బర్డ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ మల్ల శ్రీనివాస్ అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం లిటిల్ బర్డ్స్ హై స్కూల్‌లో సోమవారం సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.

పాఠశాల విద్యార్థుల మేధోసంపత్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు తమ సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పాఠశాలకు గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

మానవ సమాజం కాలానుగుణంగా వివిధ రంగాలలో సాధిస్తున్న పురోగతి, ఆధునిక జీవన విధానంలో టెక్నాలజీ ప్రాధాన్యత ఈ ప్రదర్శన ద్వారా స్పష్టమైందన్నారు. శాస్త్ర విజ్ఞానం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించి భవిష్యత్తుకు దారి చూపుతుందని పేర్కొన్నారు.

భారతదేశం శాస్త్ర, సాంకేతికత, రక్షణ రంగాలలో ప్రపంచస్థాయిలో తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని, విద్యార్థులు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News