Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:18 AM

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర

14-02-2026 305 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలోని ప్రాచీన శ్రీ భోగేశ్వరాలయం నుండి శనివారం రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం వద్ద నుంచి సుమారు 20 మంది శివ మాలధారణ స్వాములు ఝరసంఘం పుణ్యక్షేత్రం దిశగా పాదయాత్రకు ఘనంగా బయలుదేరారు.ఈ సందర్భంగా శివ మాలధారణ స్వాములు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో శివ మాలధారణను ధరించి నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరమశివుని ఆశీస్సులు పొందడం, సమాజంలో ఐక్యత, శాంతి, సత్సంప్రదాయాల పెంపొందింపునకు ఈ పాదయాత్రలు ఎంతో ఉపకరిస్తాయని వారు పేర్కొన్నారు.రెండు రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రలో స్వాములు భజనలు, హరినామ స్మరణలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పనున్నారు. మార్గమధ్యంలో భక్తులు స్వాములను ఆహ్వానిస్తూ నీరు, పానీయాలు, ప్రసాదాలు అందిస్తూ తమ భక్తిశ్రద్ధలను చాటుతున్నారు.ఈ పుణ్యయాత్ర సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ మోటార్స్ నారాయణఖేడ్ గుడిమె కృష్ణ ఆధ్వర్యంలో అల్పాహారం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శివ స్వాములు తెలిపారు. భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని, శివుని కృప అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థిస్తూ స్వాములను ఆశీర్వదించారు. గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది.

Sthanikam

శ్రీ భోగేశ్వరాలయం నుంచి ఝరసంఘం వరకు శివ స్వాముల భక్తి పాదయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News