Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:08 PM

శ్రీ సత్య సాంబశివ స్వామి పూజల్లో భక్తుల రద్దీ

15-02-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ సంతోషి మాత దేవాలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు

హర హర మహాదేవ నినాదాలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

సూర్యాపేట పట్టణంలోని శ్రీ సంతోషి మాత దేవాలయం లో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారి పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి బిల్వదళార్చన, రుద్రపారాయణం చేశారు. అనంతరం మహామంగళహారతి కార్యక్రమం నిర్వహించగా భక్తులు పరవశించిపోయారు. హర హర మహాదేవ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు దీపారాధనలు నిర్వహించగా యువత శివనామస్మరణలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.

Sthanikam

శ్రీ సత్య సాంబశివ స్వామి పూజల్లో భక్తుల రద్దీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News