Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

19-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రతి సోమవారం ఉదయం ప్రధాన అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయంలో ప్రతిరోజూ భగవద్గీత పారాయణం జరుగుతుండగా, ప్రస్తుతం 20వ సారి పారాయణం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి సోమవారం కాలభైరవ అష్టకం పారాయణం నిర్వహిస్తూ, శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడిని స్మరించడం ద్వారా అజ్ఞానం, భయం, దుఃఖం తొలగి శక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించబడుతుందని, దీని ద్వారా భక్తులకు భక్తి, ధైర్యం పెరగడంతో పాటు అనారోగ్యం, శత్రువులు, కష్టాల నుండి దైవిక రక్షణ లభిస్తుందని నమ్మకం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహాశెట్టి శివలింగ పాటిల్, సభ్యులు ముత్యపు హనుమాన్లు, మహాశెట్టి కాశీనాథ్ పాటిల్, ముత్యాల మహేష్ కుమార్, పెండ్కర్ దీపక్, దారం కృష్ణమూర్తి, దత్తు సౌకారి, కిషన్ రావు, వెంకట్ రావు, బాబురావు, లక్ష్మయ్య, అశోక్, కృష్ణ సెట్, వడ్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం వినేందుకు, చదవడానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

Sthanikam

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News