Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:58 PM

సేవా కార్యక్రమాలతో మెదక్ రీజియన్‌లో ఖేడ్ లయన్స్ క్లబ్ ప్రత్యేక గుర్తింపు

సేవా కార్యక్రమాలతో మెదక్ రీజియన్‌లో ఖేడ్ లయన్స్ క్లబ్ ప్రత్యేక గుర్తింపు

సేవా కార్యక్రమాలతో మెదక్ రీజియన్‌లో ఖేడ్ లయన్స్ క్లబ్ ప్రత్యేక గుర్తింపు
March 15, 2026 05:12 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ రీజియన్ కాన్ఫరెన్స్‌ను రీజన్ చైర్‌పర్సన్ అనిత సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పిట్లం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ లయన్స్ డైరెక్టర్ గంటమనేని బాబురావు ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కాన్ఫరెన్స్‌లో మొత్తం 14 లయన్స్ క్లబ్‌లు పాల్గొని తమ సేవా కార్యక్రమాలను ప్రదర్శించాయి.ఈ సందర్భంగా నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఏడాది నిర్వహించిన 170 సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా క్లబ్‌కు మొత్తం 17 అవార్డులు లభించాయి. క్లబ్ అధ్యక్షుడిగా సేవలందించిన సాయి సంగమేశ్వర్‌కు ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డు అందజేయగా, జోన్ చైర్మన్‌గా పనిచేసిన రాజ్ కుమార్‌కు అంతర్జాతీయ స్థాయి అవార్డు ప్రదానం చేశారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైర్మన్లు దిగంబర్ పాటిల్, చంద్రశేఖర్ ఆచార్య ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. క్లబ్ కార్యదర్శి మల్లేశంకు బెస్ట్ సెక్రటరీ అవార్డు కూడా అందించారు.నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుభారంభ్ కార్యక్రమాలు 32 నిర్వహించడంతో పాటు మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, అన్నదాన కార్యక్రమాలు, కంటి చికిత్స శిబిరాలు, ఆరోగ్య మరియు క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అలాగే పాఠశాలల విద్యాభివృద్ధికి సహకారం అందిస్తూ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం, అనాధలకు నిత్యావసర వస్తువులు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా క్లబ్‌కు ఈ అవార్డులు లభించాయి.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి క్లబ్ సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ లయన్స్ క్లబ్‌కు చెందిన సుమారు 30 మంది సభ్యులు పాల్గొని అవార్డులను స్వీకరించారు.

అందరూ కలిసి క్లబ్ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News