Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

19-04-2026 226 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

1982 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్నేహానికి మించినది లోకంలో మరొకటి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమ్మేళనాల ద్వారా పాత స్నేహితులు ఒకచోట కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమని తెలిపారు. కలిసి చదివిన వారు వివిధ రంగాలలో స్థిరపడి మళ్లీ కలుసుకోవడం స్నేహ బంధానికి ఉన్న విలువను తెలియజేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన రమేష్, చింత గోపాల్, అశోక్ కుమార్, శ్రీనివాస్, అమ్రాది మల్లికార్జున్, కరుణాకర్, లింగం, మేడం కృష్ణ, పద్మలత, గీత తదితర మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News