Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:10 AM

సమన్వయంతో పోషణ్ పక్షం విజయవంతం చేయాలి… కలెక్టర్

13-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

8వ పోషణ్ పక్షం పురస్కరించుకుని సోమవారం (13-04-2026) జిల్లా స్థాయిలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె లలిత కుమారి మాట్లాడుతూ, ఈ ఏడాది పోషణ్ పక్షం – 2026 “జీవితంలోని తొలి ఆరు సంవత్సరాల్లో పిల్లల మెదడు వికాసాన్ని ప్రోత్సహించడం” అనే థీమ్‌తో నిర్వహించబడుతుందని తెలిపారు. తల్లి-శిశు పోషణ, 0–3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధి, 3–6 సంవత్సరాల పిల్లలకు ఆట ఆధారిత విద్య, స్క్రీన్ టైమ్ తగ్గింపులో తల్లిదండ్రులు మరియు సమాజం పాత్ర, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం వంటి ఐదు ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, అన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పోషణ్ పక్షం కార్యక్రమాలు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం పోషణ్ పక్షానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఉమహారతి, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఓ, డీఆర్‌డీఏ పీడీతో పాటు ఆరోగ్య శాఖ మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సమన్వయంతో పోషణ్ పక్షం విజయవంతం చేయాలి… కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News