Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:00 AM

సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం

19-04-2026 444 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ అధ్యక్షుడు గంధిగరాజు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులు, లింగాయత్ సమాజ సభ్యులు కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు అనిమిశెట్టి జయప్రకాష్ తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్తగా, తత్వవేత్తగా సమానత్వ భావనను సమాజంలో వ్యాప్తి చేసిన మహానుభావుడని, కుల వ్యవస్థ, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పోరాడి ప్రతి వ్యక్తి శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధించినట్లు తెలిపారు. సదాశివపేటలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపను పొందాలని సమాజ సభ్యులు కోరారు. సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరగనుండగా, రాత్రి 9 గంటలకు డోలారోహణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేయనున్నారు.

Sthanikam

సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News