Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:14 AM

సమాజానికి సేవ చేయడమే గొప్ప ధర్మం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

13-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సమాజ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు ఉచిత సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణఖేడ్ లయన్స్ క్లబ్‌ను స్థాపించడం జరిగిందని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకు తోడ్పాటును అందించడం, అవసరమైన వారికి సహాయం చేయడం లయన్స్ క్లబ్ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర సౌజన్యంతో కడపల్ గ్రామానికి చెందిన శేఖర్ ఆచార్య పూర్వ విద్యార్థి బేగరి శ్రీజ వివాహ సందర్భంగా వధూవరులకు పుస్తె మట్టలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, సమాజంలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ పనిచేస్తోందన్నారు.నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం, అనాధలకు నిత్యావసర వస్తువులు అందించడం, మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ చేయడం, వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు అందించడం, మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు.అదేవిధంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అనేక మందికి కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయించామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని పేద, నిరుపేద వర్గాలకు సహాయం అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింత సేవ చేయాలని సంకల్పించామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర, జోన్ చైర్మన్ రాజ్ కుమార్, డి.సి. చంద్రశేఖర్ ఆచార్య, సభ్యులు వెంకట్రావు, అంజిరెడ్డి, రవికుమార్, మల్లేశం, ముదసిర్, యూసఫ్, బసవచైతన్య, కడపల్ మాజీ ఎంపీటీసీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సమాజానికి సేవ చేయడమే గొప్ప ధర్మం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News