Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

01-03-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న సరస్వతి శశి మందిర్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి.

పాఠశాల ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు టిడిపి యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల ఉద్దేశ్యం, విధానాన్ని వివరించగా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక దృక్పథం అలవడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.

Sthanikam

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News