Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

సైన్స్ ఎక్స్‌పోతో విద్యార్థుల సృజనాత్మకతకు నూతన దిశ, ప్రిన్సిపల్ శౌరెడ్డి

01-03-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని నేషనల్ సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకుని కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శౌరెడ్డి మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే ముఖ్యమైన సాధనమని తెలిపారు. సైన్స్ అనేది కేవలం పాఠ్యాంశం మాత్రమే కాకుండా రేపటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వారి సృజనాత్మకతకు నిదర్శనమని అభినందించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్, ఏజీఎం వీర రహమాన్, కోఆర్డినేటర్ అలీ, డి.ఎన్. శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సైన్స్ ఎక్స్‌పోతో విద్యార్థుల సృజనాత్మకతకు నూతన దిశ, ప్రిన్సిపల్ శౌరెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని నేషనల్ సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకుని కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శౌరెడ్డి మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే ముఖ్యమైన సాధనమని తెలిపారు. సైన్స్ అనేది కేవలం పాఠ్యాంశం మాత్రమే కాకుండా రేపటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వారి సృజనాత్మకతకు నిదర్శనమని అభినందించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్, ఏజీఎం వీర రహమాన్, కోఆర్డినేటర్ అలీ, డి.ఎన్. శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News