Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

సైన్స్ అభివృద్ధే దేశాభివృద్ధికి సూచిక జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చాట్రాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

01-03-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డి.పి.ఆర్.టి.యు చాట్రాయి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సైన్స్ ఉపాధ్యాయులను గౌరవిస్తూ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చాట్రాయి మండలంలో సేవలందిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నంపేట ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా సీవి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం” గురించి వివరించి, భారత శాస్త్రవేత్తల ప్రతిభను గుర్తు చేశారు.

విద్యార్థి దశ నుంచే తార్కిక ఆలోచనలు, పరిశీలనా దృష్టి, ప్రయోగ పరికల్పనలపై అవగాహన కల్పించడం సైన్స్ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నిత్యజీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరించి, శాస్త్ర–సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించుట ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు ఇ. రంగారావు, జి. సత్యన్నారాయణ రెడ్డి, కె. చంటిబాబు, కె. రామారావు, జి. పద్మజ, స్వాతి లను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో డి.పి.ఆర్.టి.యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షుడు బి.సి.హెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి. రామారావు, సంఘ నాయకులు సత్తెనపల్లి రాము, ధరావతు నాగేశ్వరావు, బి. రాందాస్, యన్. శ్రీనివాసరెడ్డి, పి. తిరుపతయ్య, చంద్రకళావతి, బి. గణేష్, ఎ. క్రాంతి, జె. రాజేష్ తదితరులు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

సైన్స్ అభివృద్ధే దేశాభివృద్ధికి సూచిక జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చాట్రాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News