Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

సదాశివపేటలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు

20-04-2026 391 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర మందిరంలో శ్రీ విశ్వగురు మహాత్మ బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, సమాజ అధ్యక్షులు గందిగ రాజు, పెద్ద మఠం అప్పగారు లింగం స్వామి, రాష్ట్ర నాయకులు శివ చందర్ కుమార్ పాటిల్ తదితరులు హాజరై బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన నాయకులు, మహాత్మ గురు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో వెలుగొందిన గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్తగా కులవ్యవస్థ, అంటరానితనం వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు. “కాయకమే కైలాసం” అనే మహాసూత్రంతో శ్రమకు గౌరవం తీసుకొచ్చి ప్రతి మనిషి సమానుడనే భావనను సమాజంలో నాటారని, అనుభవ మంటపం ద్వారా జ్ఞానం, ధర్మం, న్యాయం ప్రసారం చేసి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు.మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ మాట్లాడుతూ, ఆ కాలంలోనే మహిళలకు సమాన హక్కులు కల్పించి వారికి గౌరవ స్థానం కల్పించిన మహానుభావుడని కొనియాడగా, అధ్యక్షులు గందిగ రాజు మాట్లాడుతూ ఆయన బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూ సమానత్వం, మానవత్వానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాధి రాచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ (అడ్వకేట్), అలాగే సమాజ సభ్యులు రాచప్ప, రమేష్, రవి, సురేష్, శేఖర్, సతీష్, రవణప్ప, షాబాద్ వీరన్న, విశ్వనాథ్, ప్రవీణ్, లోకేష్, మల్లేశం, వీరు, వైద్యనాథ్, నర్సింల, నాగు తదితరులు పాల్గొనగా, వీరశైవ సమాజం సభ్యులు, పట్టణ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సదాశివపేటలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News