Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

సబ్సిడీ పథకాల అమలులో బ్యాంకులు ముందుండాలి: అడిషనల్ కలెక్టర్

18-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని అడిషనల్ కలెక్టర్ పాండు సూచించారు. ఈ పథకాల కింద మంజూరైన యూనిట్లకు బ్యాంకులు ఆలస్యం లేకుండా రుణాలు మంజూరు చేసి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన స్పష్టం చేశారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక 2025–26 కింద సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన స్వయం ఉపాధి యూనిట్లకు సంబంధించిన రుణాల మంజూరుపై ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సబ్సిడీతో ఈ పథకాలను అమలు చేస్తున్నందున బ్యాంకులు సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారని, అనంతరం స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ద్వారా అర్హుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకులు వెంటనే కాన్సెంట్ ఇచ్చి, రుణాల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పథకాల అమలులో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని చెప్పారు.జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ మరియు రుణ సదుపాయాలను సమర్థంగా వినియోగించుకుని లబ్ధిదారులు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నర్సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

సబ్సిడీ పథకాల అమలులో బ్యాంకులు ముందుండాలి: అడిషనల్ కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News