Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:11 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

13-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని మాయికోడ్, డావ్వుర్ గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, మితవేగంతో వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు కూడా చురుకుగా పాల్గొని రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

Article Image

“99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని మాయికోడ్, డావ్వుర్ గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, మితవేగంతో వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు కూడా చురుకుగా పాల్గొని రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News