Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:10 AM

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

13-04-2026 211 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం పరిధిలోని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని చాప్టకే గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ సవిత బసప్ప, బిరాదర్ మాణిక్, సంగప్ప, నరసింహులు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News