Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్

17-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వట్టిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వాహనదారులతో అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్సై లవ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే వాహనాలు సక్రమ స్థితిలో ఉన్నవే నడపాలని చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ ఉపయోగించడం, నిద్రలేమితో వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. అనంతరం వాహనదారులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News