Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:19 AM

రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలిగే జీవన్ ఏకగ్రీవ ఎన్నిక

09-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలిగే జీవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తార్నాకలో ఉన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంచార్జి మేజర్ చంద్రకాంత్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ నియామక పత్రాన్ని అలిగే జీవన్‌కు అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ అలిగే జీవన్ సామాజిక న్యాయం కోసం అనేక సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు చేస్తున్న నాయకుడని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ, అణగారిన వర్గాల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. రాజ్యాధికారాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఒకసారి లోక్‌సభకు, రెండు సార్లు శాసనసభకు పోటీ చేసి యువతలో రాజకీయ చైతన్యం మరియు రాజ్యాధికార ఆకాంక్షను పెంపొందించారని పేర్కొన్నారు. గత పదిహేను సంవత్సరాలుగా పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా అలిగే జీవన్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం కోసం మరింత బలంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తానని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు మరియు అనుచరులు పాల్గొన్నారు.

Sthanikam

రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలిగే జీవన్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News