Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:
03-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన, అవమానకరమైన కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి కొందరు నీచంగా మాట్లాడుతున్నారని, తీవ్రంగా దూషణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల అంశంపై స్పందించిన తర్వాత నుంచే కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు.

సోషల్ మీడియాలో రాయలేని భాషలో కామెంట్లు పెట్టడం, అసభ్యకరమైన మీమ్స్ సృష్టించడం, వ్యక్తిగతంగా అవమానించేలా పోస్టులు షేర్ చేయడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఇటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Sthanikam

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News