Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన

21-04-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ కార్యాలయంలో మంగళవారం డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నారాయణఖేడ్ డిపో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు 22-04-2026 నుండి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలికంగా టికెట్ పరిశీలకులుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల వారు తమ పదవ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రాల అసలు ప్రతులతో కలిసి 22-04-2026 ఉదయం నారాయణఖేడ్ డిపోకు హాజరై డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు నిరంతర రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యమని, దీనికి స్థానికుల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ కార్యాలయంలో మంగళవారం డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నారాయణఖేడ్ డిపో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు 22-04-2026 నుండి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలికంగా టికెట్ పరిశీలకులుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల వారు తమ పదవ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రాల అసలు ప్రతులతో కలిసి 22-04-2026 ఉదయం నారాయణఖేడ్ డిపోకు హాజరై డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు నిరంతర రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యమని, దీనికి స్థానికుల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News