Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:33 AM

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ

19-02-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు,

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని విమర్శించారు. ఊహాజనిత అంకెల గారడీతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని ఆరోపించారు.

పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయింపులు మొక్కుబడిగా ఉన్నాయని, సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు రూ.15,000 అంశాలపై ప్రస్తావన లేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించకుండా నీరుగార్చారని విమర్శించారు.

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లిందని, వారిని ఆదుకోవాలని కోరారు.

నూజివీడు నియోజకవర్గంలో పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు జారీ చేసిన ఫోర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి వేముల బక్కయ్య నాయకత్వం వహించగా, జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, జిల్లా కమిటీ సభ్యులు కలపాల వెంకటేశ్వరరావు, సర్వేసు భవాని, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News