Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు
02-03-2026 410 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలు గ్రామాల్లో భవనాలు, సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట మండల పరిధిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలు గ్రామాల్లో శంకుస్థాపనలు నిర్వహించారు.

నీర్నేముల గ్రామంలో మహిళా సమాఖ్య సంఘానికి నూతన భవన నిర్మాణంతో పాటు సి.సి రోడ్డు పనులకు పునాది వేశారు. నిధాన్‌పల్లి గ్రామంలో సిసి రోడ్లు, మహిళా సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. కొమ్మాయిగూడెం గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, రామన్నపేట మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సంఘానికి శాశ్వత భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక భవనాలు నిర్మించడం ద్వారా వారి కార్యకలాపాలు విస్తరించి, ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News