Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:38 AM

రామన్నపేట లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ శాస్త్రవేత్త C. V. రమణ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సైన్స్ మన దైనందిన జీవితానికి ఆధారస్తంభమని పేర్కొన్నారు. శాస్త్రీయ పురోగతి వల్ల సమాజం అనేక రంగాల్లో ముందడుగు వేసిందని, విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.

భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ జె. చిన్నబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం “వికసిత్ భారత్ దిశగా విజ్ఞాన శాస్త్రంలో మహిళలు” అనే ఇతివృత్తంతో సైన్స్ దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు.

సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉపన్యాస, చిత్ర ప్రదర్శన పోటీలు నిర్వహించారు. డాక్టర్ జి. సునీత, అనితలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా, డాక్టర్ సి.హెచ్. వెంకటేశ్వర్లు వందన సమర్పణ చేశారు.

డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, రవి, అమరేందర్, నరేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ బహుమతులు ప్రదానం చేశారు.

Sthanikam

రామన్నపేట లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News