Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:09 AM

రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

19-03-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని రామాలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ సభ్యులతో కలిసి పాల్గొని, దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజలందరికీ శుభసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్పూర్తిగా ప్రార్థించారు.అలాగే ఉగాది పండుగ సందర్భంగా ఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ఐక్యంగా జరుపుకోవడం ద్వారా సామాజిక సౌహార్దం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, బాణపురం రాజు, పాండు, మనోహర్, ఖేడ్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు, సుభాష్, నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంజూరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News