Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:11 PM

రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
April 16, 2026 04:37 PM 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కంది మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు వంటి పథకాలతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, శుభ్రత, ఆరోగ్యం, రోడ్డు భద్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా చూడాలని సర్పంచులకు సూచించారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు పెంచుతామని తెలిపారు. ఉపాధి హామీ పనులు, పాఠశాలలు, అంగన్వాడి భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News