Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

రైతుకు వందనం అవార్డు అందుకున్న పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి

01-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రైతు పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన “రైతుకు వందనం అవార్డు”ను అందుకున్నారు. సాయి అలేఖ్య ఆర్ట్స్ మరియు బిగ్ టీవీఆధ్వర్యంలోహైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అజయ్ కుమార్ రెడ్డి అవార్డు స్వీకరించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన ఆయన, సమీకృత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులను సాధించి, రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వ్యవసాయ రంగంలో ఆయన సాధించిన విశేష సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఇప్పటికే “తెలంగాణ రాష్ట్ర బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు”, “బెస్ట్ ఫిష్ ఫార్మర్ అవార్డు”, “రాష్ట్ర రైతు రత్న అవార్డు”లను అందుకున్నారు. తాజాగా “రైతుకు వందనం అవార్డు” వరించడంతో ఆయన సేవలకు మరో గుర్తింపు లభించినట్లైంది.ఈ సందర్భంగా అజయ్ కుమార్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రైతుల కష్టాన్ని గుర్తించి గౌరవించే విధంగా ఇలాంటి ప్రోత్సాహక అవార్డులను ఏర్పాటు చేస్తున్న నిర్వహణ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు గుర్తింపు, గౌరవం లభించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రైతుకు వందనం అవార్డు అందుకున్న పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News