Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

27-04-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, లిఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ తదితరులు కంగ్టి మండలంలోని గజుల్‌పాడ్ గ్రామంలో రైతు మాధవరావు పాటిల్ కుటుంబాన్ని పరామర్శించారు.మాధవరావు పాటిల్‌కు చెందిన సుమారు 8 ఎకరాలు 25 గుంటల భూమి గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ అమలులో భాగంగా అక్రమంగా ఇతరుల పేరుపై నమోదైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయించుకోవడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన నాయకులు గ్రామ పెద్దలు, మండల అధికారులతో చర్చించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి భూమి రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ లోపాల వల్లే ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని మండిపడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమ హారతి, అడిషనల్ ఎస్పీ చైతన్య, జిల్లా అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News